అసెంబ్లీ సోమవారానికి వాయిదా
హైదరాబాద్: అసెంబ్లీ, మండలి సోమవారానికి వాయిదాపడ్డాయి. 2009-10 సంవత్సరానికి గానూ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఉభయసభలూ వాయిదా పడ్డాయి. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి రోశయ్య బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, శాసన మండలిలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు బడ్జెట్ ప్రవేశపెట్టారు. రోశయ్య బడ్జెట్ ప్రతిపాదనకు 30 నిమిషాల సమయం తీసుకుంటే, ధర్మాన కేవలం 20 నిమిషాల్లో తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.
బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఉభయ సభల్లోనూ సభ్యులు మధ్యమధ్యలో నిరసనలు తెలుపుతూ వున్నప్పటికీ, సజావుగానే అమాత్యులు బడ్జెట్‌ను దిగ్విజయంగా ప్రవేశపెట్టారు. అనంతరం సభా సంప్రదాయాల ప్రకారం లాంఛనంగా ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.












Click it and Unblock the Notifications