నారాయణరెడ్డిపై చర్య : మనోహర్
హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా గేట్ 1 నుంచి అసెంబ్లీలోకి ప్రవేశించిన పీసీసీ కార్యదర్శి గూడూరు నారాయణరెడ్డిపై చర్య తీసుకోనున్నట్లు డిప్యుటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు నారాయణరెడ్డి ఓ మంత్రి వాహనంలో గేట్ 1 నుంచి అసెంబ్లీలోకి ప్రవేశించారు. వాహనంలో మంత్రి లేకపోయినా సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోకపోవటంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందగానే చర్య తీసుకుంటామని మనోహర్ తెలిపారు.












Click it and Unblock the Notifications