లండన్ లో సికింద్రాబాద్ వాసి మృతి
లండన్: లండన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకుడు మరణించాడు. అతడ్ని సికింద్రాబాద్ కు చెందిన 28 ఏళ్ల అరవింద్ గా గుర్తించారు. అతను లండన్ లోని టెక్సో సూపర్ మార్కెట్ లో ట్రైనీ మేనేజరుగా పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా అతను రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
అతని మరణ వార్త తెలుసుకున్న సికింద్రాబాదులోని కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అరవింద్ కారు మరో కారును ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు సమాచారం. గత ఎనిమిదేళ్లుగా అరవింద్ లండన్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications