హక్కుల కమిషన్ కు లడ్డూ ఫిర్యాదు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసులో తనను అన్యాయంగా ఇరికించి పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని గుర్విందర్ సింగ్ అలియాస్ లడ్డూ బుధవారం మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశాడు. ఏడాది పాటు తనను చిత్రహింసలకు గురి చేశారని అతను ఫిర్యాదు చేశాడు.
అయేషా కేసులో తన కుమారుడి అన్యాయంగా ఇరికించి తన ప్రతిష్టను పోలీసులు దెబ్బ తీశారని లడ్డూ తండ్రి అమర్ జిత్ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశాడు. ఆయన 27 మంది పోలీసులపై మానవ హక్కుల కమిషనుకు ఫిర్యాదు చేశాడు. తన ప్రతిష్టను దెబ్బ తీశారని అమరజిత్ 2 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. అయేషా హత్య కేసులో పోలీసులు లడ్డూను అరెస్టు చేసి అతని పాత్ర లేదని తేల్చారు. ప్రస్తుతం ఈ కేసులో సత్యంబాబు అనే నిందితుడు చేరాడు.












Click it and Unblock the Notifications