మగధీర సినిమాకు వచ్చి మృతి

ఈ క్రమంలో ఒకరిమీద ఒకరు నిలిచి, చేతులు చాచారు. ఈ సమయంలో బాలరాజుతోపాటు నాగశేషులు(28), అభిమన్యుడు విద్యుత్ తీగలు తగిలి షాక్ కు గురయ్యారు. వీరిలో కుప్పకూలిన బాలరాజు, నీళ్ల పాకెట్ తెప్పించి తాగించేలోపే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న ఎస్ ఐ నరసింహారావు సిబ్బందితో వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. సంఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ డివిజన్ నాయకుడు వెంకటరమణ మాదిగ థియేటర్ యజమానిని కోరారు. బాలరాజు కుటుంబాన్ని తాము ఆదుకుంటామని, తగిన సాయం అందిస్తామని చిరంజీవి అభిమానుల సంఘం ప్రకటించింది.












Click it and Unblock the Notifications