హైదరాబాద్: చిత్తుగా తాగి టాంజానియన్లు శనివారం తెల్లవారు జామున హైదరాబాదులో వీరంగం సృష్టించారు. హైదరాబాదులోని పంజగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో గల గ్రీన్ లాండ్స్ ప్రాంతంలో టాంజానియన్లు కొంత మంది చిత్తుగా తాగి కారు నడుపుతూ నానా గొడవ చేశారు. అడ్డువచ్చినవారిని కొడుతూ, ఇతర వాహనాలను ఢీకొడుతూ వారు బీభత్సం సృష్టించారు. తమను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో ఎస్సై, పోలీసు కానిస్టేబుల్ గాయపడ్డారు. ఎలాగో అలాగా పోలీసులు వారిని పట్టుకుని కేసు నమోదు చేశారు. పంజగుట్ట పోలీసు స్టేషనులో వారిపై కేసు నమోదైంది.