నల్లగొండ: భార్యపై ఓ కిరాతక భర్త యాసిడ్ దాడి చేశాడు. నల్లగొండలో ఈ ఘాతుకం జరిగింది. బంగారం పని చేసే హుస్సేన్ అనే వ్యక్తి తన భార్య జమీలాపై యాసిడ్ తో దాడి చేశాడు. అదనపు కట్నం కోసం అతను ఈ దారుణ చర్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. జమీలా ముఖం, భుజం, చేతులపై యాసిడ్ పడింది. దీంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. హుస్సేన్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.