వైయస్ పాలనలో బాంబులే: బాబు

హైదరాబాదు అభివృద్ధి తమ హయాంలోనే జరిగిందని వైయస్ చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. హైదరాబాద్ అభివృద్ధి ఏమైనా జరిగిందంటే అది తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని చంద్రబాబు అన్నారు. వైయస్ తీరు చూడబోతుంటే చార్మినార్ ను, గొల్కొండను తానే కట్టించానని అనేట్లున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడం వల్లనే వైయస్ పాలనలో ఫ్లై ఓవర్లు కూలుతున్నాయని ఆయన అన్నారు. తన ఆస్తులపై, వైయస్ ఆస్తులపై సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణకు తాను సిద్ధమని ఆయన అన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా రెఫరెండానికి కూడా తాను సిద్ధమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications