చిరు మంచి వ్యక్తి, అయితే..: గౌడ్

Devender Goud
హైదరాబాద్: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి మంచి వ్యక్తి అని ఆ పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరడానికి సిద్ధమైన ఆయన సోమవారం తన అనుచరులతో సమావేశమయ్యారు. చిరంజీవి తమకు మంచి గౌరవం ఇచ్చారని, తమను ప్రేమతో, అభిమానంతో చూశారని ఆయన సమావేశంలో అన్నారు. ప్రజారాజ్యం పార్టీని వీడడానికి గల కారణాలను స్పష్టంగా చెప్పకుండానే ఆయన తెలుగుదేశంలో చేరాల్సిన అవసరాన్ని ఆయన చెప్పారు. నిర్మాణం, కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం అని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీని ఎదుర్కోవడానికి, దాని నియంతృత్వ ధోరణులను సమర్థంగా ఎదుర్కోవడానికి బలమైన ప్రతిపక్షం అవసరమని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ తమ మాతృత్వ సంస్థ అని ఆయన అన్నారు. ప్రజల పక్షాన ఉండడమా, ప్రభుత్వ వ్యతిరేక పాలన వైపు ఉండడమా అని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందని, పదవుల కోసం తాము ఆశ పడడం లేదని ఆయన అన్నారు. ప్రజాస్వామిక ధర్మాన్ని నిలబెడుతోందని ఆయన అన్నారు. దోపిడీ వ్యవస్థను అంతమొందించడానికి తమను సంసిద్ధం చేసిన పార్టీని బలోపేతం చేద్దామని ఆయన అన్నారు. రాష్ట్రంలోనే కాదు, యావద్దేశంలో దీన్ని ఒక అవకాశంగా తీసుకుందామని ఆయన అన్నారు.

కాంగ్రెసు ప్రభుత్వం నియంతృత్వ ధోరణులు అవలంబిస్తోందని, ప్రతిపక్షాలను రూపుమాపే పనికి పూనుకుందని, ఈ స్థితిలో బలమైన ప్రత్యామ్నాయం అవసరమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని తుడిచిపెట్టే పనికి కాంగ్రెసుకు పూనుకుంటోందని ఆయన అన్నారు. వామపక్షాల సంఖ్య కూడా తగ్గిపోయిందని, దేశంలో రాష్ట్రంలో కాంగ్రెసుకు బలమైన ప్రత్యామ్నాయం అవసరమని, అది చారిత్రకంగా అవసరంగా ముందుకు తీసుకుని పోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉందని, దానిపై విశ్వాసంతోనే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెసుకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఒక విధానం కారణంగా తాము తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోయామని, విధానపరమైన సవరణకు పూనుకున్న తర్వాత తిరిగి ఆ పార్టీలో చేరే విషయంపై ఆలోచన చేయాల్సి ఉండిందని, అప్పటి రాజకీయ పరిణామాల కారణంగా ఆ ఆలోచన చేయలేకపోయామని, అది చారిత్రక తప్పిదమని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ కేవలం 36 శాతం ఓట్లతోనే అధికారంలోకి వచ్చిందని, ఇది కాంగ్రెసుకు నైతిక ఓటమి అని, ఈ స్థితిలో ప్రభుత్వం స్థిరంగా నిలదొక్కుకోవడం కష్టమని, దీన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెసు పార్టీ 2014 ఎన్నికలకు సమాయత్తమవుతూ ప్రతిపక్షాలను అణచివేసే పనికి పూనుకుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీనుంచి భౌతికంగా వెళ్లి పోయినా మనసంతా అక్కడే ఉందని ఆయన అన్నారు.తెలుగుదేశంలో చేరడానికి తాను సంసిద్ధమైన విషయాన్ని దేవేందర్ గౌడ్ తన ప్రసంగంలో స్పష్టంగానే చెప్పారు. తాము పదవుల కోసం ఆశపడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడం లేదని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలోకి వెళ్తున్నామని, దేశంలో రాష్ట్రంలో ప్రజాస్వామిక పునరుద్ధరణ కోసం వెళ్తున్నామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+