హైదరాబాద్: మార్గదర్శి కేసులో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు సోమవారం చుక్కెదురైంది. కింది కోర్టులో వ్యక్తిగత మినహాయింపును కోరుతూ రామోజీరావు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. మార్గదర్శి పైనాన్స్ లో తీవ్ర అవకతవకలు జరిగాయని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది.