హైదరాబాద్: హైదరాబాదు సమీపంలోని ఉప్పల్ లో యువతీయువకులు ఇద్దరు శవాలుగా కనిపించడం పలువురిని కలత పెట్టింది. ఉప్పల్ ప్రాంతంలోని రాజ్యలక్ష్మీ థియేటర్ సమీపంలో ఇద్దరు యువతీయువకులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరిని ప్రేమికులుగా అనుమానిస్తున్నారు. పురుగు మందు సేవించి వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.
యువతీయువకుల శవాలను చూసిన స్థానికులు ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులను గుర్తించాల్సి ఉంది.