ఎల్బీ నగర్ పిఎస్ లో లాకప్ డెత్?

పోలీసుల వాదనతో జనార్దన్ బంధువులు విభేదిస్తున్నారు. తీవ్రంగా కొట్టడంవల్లనే జనార్దన్ మరణించాడని వారంటున్నారు. జనార్దన్ తప్పు అంగీకరించాడని, అందువల్ల కొట్టాల్సిన అవసరం కూడా తమకు లేదని పోలీసులంటున్నారు. కాగా, జనార్దన్ తో పాటు ఉన్న సుధాకర్ ను లాకప్ లో వేశారు. సుధాకర్ చేత పోలీసులు ఏం జరిగిందనే విషయం చెప్పించి ఉంటే అనుమానాలు నివృత్తి అయి ఉండేవని వాదన వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే, జనార్దన్ మృతదేహానికి పోస్టు మార్టం జరుగుతోంది. జనార్దన్ పోలీసుల దెబ్బల వల్లనే మరణించాడని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇస్తున్నారు. సుధాకర్, జనార్దన్ గతంలో కూడా నేరాలు చేసి చాదర్ ఘాట్ పోలీసు స్టేషన్ నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తూ ఎటిఎం నేరాలు మొదలు పెట్టారు.












Click it and Unblock the Notifications