ఆసీస్ లో మరో భారత విద్యార్థిపై దాడి

మాల్ సూపర్ వైజరుగా పనిచేస్తున్న మోహిత్ పై వెనక నుంచి బీరు బాటిల్ తో దాడి చేశారు. తలపై గట్టిగా కొట్టారు. ఆ తర్వాత బేస్ బాల్ అతన్ని కొట్టారు. ఛాతీపై, కాళ్లపై బేస్ బాల్ తో మోదారు. ఇండోర్ లో ఆటోమొబైల్ వ్యాపారం చేసే మోహిత్ తండ్రి అనిల్ మంగళ్ కు ఆ మేరకు సమాచారం అందింది. తన కుమారుడికి శత్రువులెవరూ లేరని ఆయన చెప్పారు.
మోహిత్ బిఇ చదవడానికి రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లాడు. భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత భారతీయులపై జరిగిన దాడుల్లో ఇది నాలుగవది. భారతీయ విద్యార్థుల భద్రతకు అన్ని చర్యలూ తీసుకుంటామని ఆస్ట్రేలియా ప్రధాని కెవిన్ రుడ్ కృష్ణకు హామీ ఇచ్చిన తర్వాత కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications