తమ్మినేని రీఎంట్రీకి లైన్ క్లియర్

కాగా, తమ్మినేని సీతారాం రీఎంట్రీని తెలుగుదేశం సీనియర్ నాయకుడు కె.ఎర్రంనాయుడు తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. అయితే పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నచ్చజెప్పడంతో ఆయన సుముఖంగా మారినట్లు చెబుతున్నారు. తమ్మినేని సీతారాంను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎర్రంనాయుడు సోమవారం చెప్పారు. పార్టీనుంచి వెళ్లిపోయే ముందు తనపై చేసిన విమర్శలకు తమ్మినేని నుంచి వివరణ అడగడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా తమ్మినేని పార్టీలోకి తిరిగి రావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications