ఈ శతాబ్ది అతి పెద్ద కరువు: ప్రణబ్

కరువు పరిస్థితుల ప్రభావం ఆర్థిక పెరుగుదలపై కూడా పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. దేశంలోని 161 జిల్లాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఈ ప్రకటన చేశారు. కాగా, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కరువు పరిస్థితులపై సమీక్షలు జరుపుతున్నారు. మన్మోహన్ సింగ్ 13వ ఆర్థిక సంఘం చైర్మన్ విజయ్ కేల్కర్, ప్రణాళికా సంఘం కార్యదర్శి సుధా పిళ్లైలతో సమావేశమై కరువు పరిస్థితులపై సమీక్ష జరిపారు.












Click it and Unblock the Notifications