విజయవాడ: విజయవాడ సమీపంలోని గొల్లపూడి శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న లోహితా రెడ్డి అనే విద్యార్థిని బుధవారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కళాశాల భవనం ఐదో అంతస్తు పైనుంచి దూకింది. దాంతో ఆమె తీవ్ర గాయాల పాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
ఆమెను వెంటనే కళాశాల యాజమాన్యం ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించింది. లోహితా రెడ్డిది ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రామం. అయితే ఆమె ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరాలేదు.