రైతులతో చెలగాటం: బాబు

తెలంగాణను కరవు ప్రాంతంగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరువు నివారణ చర్యల్లో భాగంగా రైతులకు సబ్సిడీ కింద విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలని తెరాస సభ్యుడు హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. రోజుకు ఐదుగురు చొప్పున రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆయన అన్నారు. సహాయం అందించకపోతే రైతుల ఆత్మహత్యలు ఆగవని ఆయన అన్నారు.
కరువు పరిస్థితులపై ప్రభుత్వం ఎలాంటి అలసత్వం ప్రదర్సించడం లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి కె. రోశయ్య అన్నారు. కరవు సహాయ చర్యల కోసం ప్రభుత్వం అధికారులతో సీరియస్ గా చర్చిస్తోందని ఆయన చెప్పారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి ఇదివరకే సభలో చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. మొన్నటి మంత్రి వర్గం సమావేశంలో కూడా ఎజెండాను పక్కన పెట్టి కరువుపై చర్చించినట్లు ఆయన తెలిపారు. రైతులకు సబ్సిడీలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications