కేరళకు బాంబు బెదిరింపులు

ఇ మెయిల్ బెదిరింపులు గురువారం సాయంత్రం కొన్ని మీడియా సంస్థలకు కూడా వచ్చాయని పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ టామిన్ జె. థాచెంకరీ చెప్పారు. ఇమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని కనిపెట్టామని ఆయన చెప్పారు. కంప్యూటర్ ఐపిని కనుక్కోవడానికి ప్రాథమిక సమాచార నివేదిక రావాల్సి ఉందని ఆయన చెప్పారు.
ఇ మెయిల్ జకీర్ హుస్సేన్ పేర వచ్చింది. తాను కొత్తగా ఏర్పాటు చేసిన మలబార్ ముజాహిద్ హెడ్ నని చెప్పుకున్నాడు. దాని కేంద్ర కార్యాలయం కరాచీలో ఉన్నట్లు తెలిపాడు. తమకు ఐఎస్ఐ, లష్కరే తోయిబా మద్దతు ఉందని చెప్పుకున్నాడు. శుక్రవారం బాంబు పేలుళ్లు ప్రారంభమవుతాయని బెదిరించాడు.












Click it and Unblock the Notifications