ఆంధ్రజ్యోతిపై దావా వేస్తా: ఎంపీ

Nalgonda
నల్లగొండ: ఆంధ్రజ్యోతి దినపత్రికపై నల్లగొండ జిల్లా భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలపై తాను చేసిన వ్యాఖ్యలను ఆంధ్రజ్యోతి వక్రీకరించిందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించిన ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన చెప్పారు. తన వ్యాఖ్యలను వక్రీకరించినందుకు ఆంధ్రజ్యోతి యాజమాన్యం తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాను ఆ వ్యాఖ్య చేసినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ చేశారు.

కరువు పరిస్థితిలో రైతులు తాగుడుకు బానిసలై అప్పుల పాలవుతున్నారని, అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. పార్లమెంటు సభ్యుడి వ్యాఖ్యలను ఒక టీవీ చానెల్ పదే పదే ప్రసారం చేసింది. రైతుల ఆత్మహత్యలను ప్రోత్సహించకూడదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై అన్ని వైపుల నుంచి రాజగోపాల్ వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+