23కు పెరిగిన స్వైన్ ఫ్లూ మృతులు

మహారాష్ట్రలో 63 ఏళ్ల మహిళ, కేరళలో అమెరికా నుంచి కేరళకు తిరిగి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తి స్వైన్ ఫ్లూతో మృత్యువాత పడ్డారు. కేరళలో స్వైన్ ఫ్లూ వల్ల తొలి మరణం సంభవించింది. నిస్సార్ అమెరికా నుంచి ఇటీవలే కేరళకు తిరిగి వచ్చాడు. చెన్నైకి కూడా ప్రయాణం చేశాడు. తిరువనంతపురం కిమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు. వడదొరాలో ఏడేళ్ల బాలిక మరణించింది. గుజరాత్ లోని వడదొరాలో ఆర్యా బోర్డే అనే ఏడేళ్ల బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
స్వైన్ ఫ్లూ వ్యాధికి తీవ్రంగా దెబ్బ తిన్న నగరం మహారాష్ట్రలోని పూణే. పూణేలో శ్రుతి గవాడే అనే 13 ఏళ్ల బాలిక మరణించింది. దక్షిణ ముంబైలోని బైకుల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో సయీదా దోర్హీవాలా అనే 63 ఏళ్ల మహిళ మరణించింది. ముంబైలో షాహిదా వార్సీ అనే బాలిక ప్రైవేట్ ఆస్పత్రిలో మృత్యువాత వడింది.తాజాగా బుధవారం మహారాష్ట్రలోని నాసిక్ లో స్వైన్ ఫ్లూతో ఒక వైద్యుడు మరణించాడు. డాక్టర్ రూపేష్ గాంగుర్దే సోమవారం నాసిక్ ఆస్పత్రిలో చేరాడు. అతను బుధవారం మరణించాడు. పూణేలో శ్రావణి దేశ్ పాండే అనే 29 ఏళ్ల మహిళ మరణఇంచింది. 35 ఏళ్ల సంజయ్ మిస్త్రీ మరణించిన రెండు గంటలకే ఆమె మృత్యువాత పడింది.












Click it and Unblock the Notifications