తాజా ఉగ్రవాద ముప్పు: ప్రధాని

బహిరంగ ఉగ్రవాద కార్యకలాపాలు తిరిగి జరుగుతున్నాయనే మాటలో నిజం లేదని, షోపియన్, బారాముల్లా, సోపోర్ వంటి సంఘటనలను వాటికి అంటగట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. వార్షిక అమర్నాథ్ యాత్ర ప్రశాంతంగా ముగియడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా జమ్మా కాశ్మీర్ లో పరిస్థితి మెరుగు పడిందని ఆయన చెప్పారు.
దేశానికి ఉగ్రవాదుల ముప్పు పూర్తిగా తప్పి పోలేదని, దేశం తన భద్రతా చర్యలను తక్కువ చేయలేదని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం అంతకు ముందు అన్నారు. నక్సల్స్ ను ఎదుర్కునే రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను తాము ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications