రాజకీయాలు వద్దు: సిఎం

YS Rajasekhar Reddy
హైదరాబాద్: కరువుపై రాజకీయాలు వద్దని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్షాలకు సూచించారు. కరవు ప్రాంతాలను ప్రకటించకపోవడంలో వేరే ఉద్దేశం ఏమీ లేదని ఆయన అన్నారు. శాసనసభలో కరవుపై జరిగిన చర్చకు ఆయన గురువారం శాసనసభలో సమాధానమిచ్చారు. మేఘమథనంపై ప్రతిపక్షాలు వ్యవసాయ శాఖా మంత్రి రఘువీరారెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని, ఆ ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు. క్షామపీడిత ప్రాంతాల్లో వర్షాలు పెంచడానికే మేఘమథనం చేపట్టామని ఆయన చెప్పారు. దేవుని దయ వల్ల వర్షాలు కురుస్తున్నాయని తాను అన్నానని, అందులో తప్పేముందని ఆయన అన్నారు. కరవు సహాయక చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. కరవు ప్రతి రోజూ సమీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.

జాతీయ ఉపాధి హామీ పథకం వల్ల రోజుకు 50 లక్షల మందికి ఉపాధి లభిస్తోందని, ఈ పథకాన్ని తాము సమర్థంగా, పారదర్శకంగా అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. రాజీవ్ గాంధీ ఆరోగ్య శ్రీ వల్ల పేదలకు మేలు జరుగుతోందని, ఈ పథకాన్ని తమ సీనియర్ నేత జి వెంకటస్వామి కూడా ప్రశంసించారని ఆయన చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా చూస్తున్నామని ఆయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా కరవుపై చర్చిద్దామని ఆయన సూచించారు. ఏ పేదవాడికి కూడా ఇబ్బంది కలగకుండా పథకాలను అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

దుర్భిక్ష ప్రాంతాల్లో రైతులను, కూలీలను ఆదుకోవడానికి, వారిలో ఆత్మవిశ్వాసం పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, రైతుల ఆత్మహత్యలు జరగకుండా చూస్తామని తాను చెప్పడంలో తప్పేమీ లేదని, రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచడానికే తాను ఆ మాట అన్నానని, అంత మాత్రాన ఎక్కడైనా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అది తన ప్రకటన తప్పు కాదని, ఎవరైనా చనిపోతే ధైర్యం చెప్తామని, అదే పద్ధతిలో తాను ఆ మాట అన్నానని ఆయన చెప్పారు. రైతులను తాము నిర్లక్ష్యం చేయడం లేదని ఆయన చెప్పారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన చెప్పారు.

లక్ష రూపాయల నష్టపరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అంటూ గత తెలుగుదేశం ప్రభుత్వం ఆ నష్టపరిహారాన్ని రద్దు చేసిందని, తాము 24 గంటల లోగా రైతు మరణిస్తే కుటుంబానికి లక్షన్నర రూపాయలు అందిస్తున్నామని ఆయన చెప్పారు. రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచడం అవసరమని, వారిని నైతికంగా దెబ్బ తీయకూడదని, గతంలో రైతుల ఆత్మస్థయిర్యం దెబ్బ తినేలా వ్యవహరించారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+