ఈనాడుపై చిరంజీవి మండిపాటు

జన్మనిచ్చిన తల్లి గొంతు కోసే విధంగా ఈనాడు వార్తా కథనం ఉందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో మూడో పార్టీకి స్థానం లేదా అని ఆయన అడిగారు. తమ పార్టీలో ఎవరూ ఏమీ మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్ని సార్లు రాసిన రాతలు తప్పని చెప్పాలని ఆయన అన్నారు. పార్టీలో అభద్రత కలిగించే విధంగా, ఆందోళన కలగజేసే విధంగా వ్యతిరేక వార్తలు రాస్తున్నారని ఆయన అన్నారు. తాము ఉండకూడదని ప్రజలు అనుకుంటే సరే, పత్రికలు కాదని ఆయన అన్నారు. ఆ పత్రికలు ప్రజల పక్షాన నిలబడడం లేదని, స్వార్థ ప్రయోజనాలతో పని చేస్తున్నాయని అన్నారు. ప్రజలు లేని రాజ్యమంటూ గతంలో కూడా వార్తలు రాశారని ఆయన గుర్తు చేశారు. ఓటమికి సొంత కారణాలు, ఇతర కారణాలు కూడా ఉండవచ్చునని ఆయన అన్నారు. శాసనసభ ఉంది కాబట్టి ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని, తాము ప్రజల్లోకి వెళ్తామని ఆయన అన్నారు. ప్రజల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నాయని ఆయన అన్నారు. తాను ఏ జిల్లాకు వెళ్లినా లక్షలాది మంది వస్తారనే విషయం తాను చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications