మీనమేషాలు లెక్కించొద్దు: చిరు

రైతులను అదుకోవడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆయన విమర్శించారు. కరవుపై తాను కొత్తగా మాట్లాడేదేమీ లేదని, ఇంతకు ముందు సభ్యులు కూడా చెప్పారని, ప్రభుత్వానికి కూడా తెలుసునని, అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించాలని, కేంద్రం నుంచి కనీసం పదివేల కోట్ల ప్యాకేజీని రాబట్టాలని, రైతుల రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని, మరణించిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
రాజకీయ పార్టీలకు అతీతంగా కరువుపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. తెలిసిన విషయాలను అంగీకరించి చర్యలు తీసుకుని పరిష్కారం చేయడం అవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications