కరవుపై టిడిపి, లెఫ్ట్ పాదయాత్ర

Chandrababu Naidu
హైదరాబాద్: కరువు జిల్లాలను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం, వామపక్షాల శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు శుక్రవారం ఉదయం పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర ట్యాంక్ బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం నుంచి శాసనసభ వరకు సాగింది, ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలు ఎండు గండి మోపులు పట్టుకుని ప్రదర్శన చేశారు. అంతకు ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

కరవు సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు విమర్శించారు. కేంద్రం నుంచి తగిన నిధులు రాబట్టడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, వారికి ధైర్యాన్నిచ్చి వాటిని ఆపాల్సిన అవసరం ఉందని, ఈ విషయాలను వేటినీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.

కరువుకు, బ్యాంకర్ల సమావేశానికి ముడిపెట్టడం సరి కాదని చంద్రబాబు అన్నారు. కరవుపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆయన అన్నారు. ప్రతిపక్షాల గొంతును ప్రభుత్వం నొక్కేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. బేషజాలకు వెళ్లకుండా వాస్తవాలను ముఖ్యమంత్రి సభకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+