అసెంబ్లీ: ఇందిరమ్మ ఇళ్లపై రభస

ఇందిరా ఆవాస్ యోజన కింద నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తే ఆ తర్వాత ఒక్క పైసా రాదని చంద్రబాబు అన్నారు. ఇందిరా ఆవాస్ యోజన కింద నిధులు దుర్వినియోగం అయ్యాయని, ఈ దుర్వినియోగంలో 31 మంది ప్రజాప్రతినిధులున్నారని, సభా సంఘం వేస్తే వాటిని నిరూపిస్తే రుజువు చేస్తామని ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు ఇందిరా ఆవాస్ యోజన కింద కట్టిన ఇళ్లలో ఏమీ దక్కలేదని, వారికి 60 శాతం ఇళ్లు కట్టించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. చట్టాలు కాంగ్రెసు వారికి చుట్టాలుగా మారాయని, రాష్ట్ర సంపదను దోచుకు తింటున్నారని ఆయన ఆరోపించారు. నిస్పృహతో ముఖ్యమంత్రి ఉన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications