వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెద్ద చేపలు పట్టండి: పిఎం

అవినీతిపై పోరుకు ఒక పరిష్కారం మాత్రమే లేదని, వివిధ స్థాయిల్లో అవినీతిపై పోరాటం చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. దర్యాప్తు వేగవంతంగా జరగడం అవసరం, ముఖ్యమని ఆయన అన్నారు. దర్యాప్తులు వేగవంతంగా జరిగినంత మాత్రాన సరిపోదని విచారణలు, తీర్పులు కూడా వేగంగా జరగాలని ఆయన అన్నారు. కొత్తగా 71 సిబిఐ కోర్టులను స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇవి అదర్శవంతమైన కోర్టులుగా పనిచేస్తాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.