హిమాచల్ ప్రదేశ్: హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది దుర్మరణం చెందారు. మరో 24 మంది గాయపడ్డారు. బిలాస్ పూర్ నుంచి సుందర్ నగర్ వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. దీంతో ఈ ప్రమాదం సంభవించింది.
సమాచారం అందిన వెంటనే మండీ డిప్యూటీ కమిషనర్ ఓంకార్ శర్మ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.