అంతు పట్టడం లేదు: చిదంబరం

P Chidambaram
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎందుకు కూలిపోయిందో అంతు పట్టడం లేదని కేంద్ర హోం మంత్రి చిదంబరం అన్నారు. హెలికాప్టర్ ఫ్లయిట్ పాత్ నుంచి తూర్పు దిశగా ఎందుకు వెళ్లిందో విచారణలో తేలుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఐదుగురు హెలికాప్టర్ లో మరణించిన విషయాన్ని ఆయన మీడియా ప్రతిధుల వద్ద ప్రకటించారు. హెలికాప్టర్ కొండను ఢీకొట్టి భగ్గుమందని, హెలికాప్టర్ తునాతునకలైందని ఆయన అన్నారు. మృతదేహాలు కాలిపోయాయని ఆయన చెప్పారు.

మృతదేహాలు కర్నూలు జిల్లాలోని ప్రమాద స్థలంలోనే ఉన్నాయని ఆయన చెప్పారు. వాటిని కర్నూలుకు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. మృతదేహాలను హైదరాబాదుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని ఆయన అన్నారు. రాజశేఖరరెడ్డి మరణం తనను ఎంతో కలచివేస్తోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+