హైదరాబాద్:ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో మొదటి విడత సీట్ల కేటాయింపు ఆదివారం జరగనుంది. శనివారం రాత్రి నుంచి ప్రారంభించే అవకాశం ఉందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.సి.రెడ్డి సూచనప్రాయంగా చెప్పారు. రాత్రి ఎన్ని గంటలకు అ న్నది మాత్రం కచ్చితంగా ఆయన చెప్పడం లేదు. ఆదివారం మాత్రం కచ్చితంగా సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నట్లు వెబ్ కౌన్సెలింగ్ అధికారి కె.రఘునాథ్ తెలిపారు.