హైదరాబాద్: నాగచైతన్య నటించిన మొట్టమొదటి చిత్రం జోష్ ని వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అంకితమిస్తున్నట్లు శనివారం నాగార్జున ప్రకటించారు. వైఎస్ నిత్యం ప్రజల గురించే ఆలోచించి, ప్రజల శ్రేయస్సు కోసమే తపించారని నాగార్జున అన్నారు. జోష్ చిత్రం విడుదలైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ ఆకస్మిక మృతి రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. అయితే అభిమానులు ఆత్మహత్యలకు పాల్పడితే ఆయన ఆత్మ శాంతించదని, అందరూ సంయవనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.