సిఎం వాదన బాధిస్తోంది: జగన్

YS Jaganmohan Reddy
హైదరాబాద్: తనను ముఖ్యమంత్రిని చేయాలని కొంత మంది వాదోపవాదాలకు దిగడం తనను బాధిస్తోందని దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం తన అభిమానులకు ఒక బహిరంగ లేఖ రాశారు. సంయమనం పాటించాలని ఆయన అభిమానులను కోరారు. బహిరంగ ప్రకటనలు కూడా చేయవద్దని ఆయన కోరారు. నాన్న వైయస్ రాజశేఖర రెడ్డి ఆలోచనలను కార్యరూపంలో పెట్టడమే నాన్న ఆత్మకు శాంతి అని ఆయన అన్నారు.

కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయాన్ని మనందరం అనుసరిద్దామని ఆయన చెప్పారు. అధిష్ఠాన వర్గం నిర్ణయాన్ని శిరసా వహిద్దామని ఆయన సూచించారు. నాన్న వైయస్ మృతికి సంతాపం ప్రకటించిన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ పార్టీల నాయకులకు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+