వైయస్ సంతాప సభకు బ్రేక్

డి. శ్రీనివాస్ ఎంతగా సర్ది చెప్పినా వారు వినలేదు. మీ అభిప్రాయాలను పార్టీ అధిష్ఠానవర్గానికి వినిపిస్తామని, మౌనంగా ఉండాలని వైయస్ సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి చేసిన విజ్ఞప్తిని కూడా వారు ఖాతరు చేయలేదు. దీంతో సభను అర్థాంతరంగా ముగించారు. వక్తలెవ్వరూ ప్రసంగించలేదు. ఈ సభలో మాజీ ముఖ్యమంత్రులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నాదెండ్ల భాస్కరరావు, కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు తదితర ముఖ్యనేతలు ఈ సమావేశానికి వ్చచారు. వైయస్ సన్నిహిత మిత్రుడు కెవిపి రామచంద్రరావు గద్దించిన తర్వాత కార్యకర్తలు మౌనం వహించారు. ఆ తర్వాత సంతాపం ప్రకటించినట్లు, సభను ముగిస్తున్నట్లు డి. శ్రీనివాస్ చెప్పారు.












Click it and Unblock the Notifications