టెక్కలిలో మందకొడిగా పోలింగ్

టెక్కలి నియోజకవర్గంలోని 283 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 1.77 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా 1200 మంది పోలీసులను నియోగించారు. 36 సమస్యాత్మక కేంద్రాల్లో వీడియో కెమెరాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత శ్రీకాకుళం డిగ్రీ కళాశాలలో వీటిని భద్రపరుస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ నెల 14వ తేదీన ఫలితం వెలువడుతుంది. గురువారం సాయంత్రానికి 50 శాతం పోలింగ్ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications