నిథారీ హత్యలు: కొహ్లీకి మరణశిక్ష

ఈ ఏడాది ఆగస్టు 6వ తేదీన ఈ కేసులో తీర్పును అలహాబాద్ హైకోర్టు రిజర్వ్ చేసింది. నిథారీ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొహ్లీ, మొనిందర్ హైకోర్టులో సవాల్ చేశారు. నోయిడాకు చెందిన పాంథేర్ కు, కొహ్లీకి ఘజియాబాద్ లోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఫిబ్రవరి 13వ తేదీన మరణ శిక్ష విధించింది. ఇంట్లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆమెను హత్య చేశారనే ఆరోపణపై వారికి కోర్టు ఆ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. నిథారీకి సమీపంలోని ప్రాంతాలకు చెందిన పలువురు బాలికలను వారు రేప్ చేసి హత్య చేశారనే ఆరోపణలున్నాయి. 2006 డిసెంబర్ లో పాంథేర్ ఇంట్లో పలు మానవ కంకాళాలు లభించాయి.












Click it and Unblock the Notifications