అంధ్ర నేతపై తొందరేం లేదు: ప్రణబ్

మహిళా జర్నలిస్టులతో శుక్రవారం సాయంత్రం జరిగిన ఇష్ఠాగోష్టిలో ఆయన ఆంధ్రప్రదేశ్ లో నాయకత్వ మార్పుపై మాట్లాడారు. అది పెద్ద సమస్యేం కాదని, ఆంధ్రప్రదేశ్ పెద్ద నాయకుడిని కోల్పోవడం దురదృష్టకరమని, దాంతో భావోద్వేగమైన ఆందోళన చోటు చేసుకుందని, రాష్ట్రంలో నాయకత్వ మార్పు సమస్యకు మార్గం దొరుకుతుందని ఆశిస్తున్నామని, దానికి చాలా సమయం పట్టవచ్చునని, ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయమూ తీసుకోలేదని ఆయన వివరించారు. అయితే ఎక్కువ కాలం కూడా తీసుకోవాలని పార్టీ అధిష్ఠాన వర్గం భావిస్తోంది. వారం, పది రోజుల్లో సమస్యకు పరిష్కారం కనుక్కోవచ్చునని భావిస్తున్నారు.
తమ నిర్ణయానికి జగన్ తలొగ్గేలా చేయాలనేది పార్టీ అధిష్ఠానవర్గం వ్యూహంగా కనిపిస్తోంది. అంత వరకు రోశయ్యను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని అనుకుంటోంది. ఈ స్థితిలో పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అనేది లేదని, ముఖ్యమంత్రి ముఖ్యమంత్రేనని ఆయన అన్నారు. ప్రమాణం స్వీకారం చేసిన ముఖ్యమంత్రి, మంత్రి వర్గ సభ్యులున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications