సి - బ్లాక్ కు రోశయ్య

రోశయ్యను మరింత కాలం ముఖ్యమంత్రిగా కొనసాగించడానికి నిర్ణయించుకోవడం వల్లనే పార్టీ ఆ సూచన చేసినట్లు భావిస్తున్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే ఒత్తిడి తగ్గుతున్న కొద్దీ పావులు కదిపే పద్ధతిని పార్టీ అధిష్ఠాన వర్గం ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. నిజానికి సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి సంతాపం ప్రకటిస్తూ తీర్మానం చేయాల్సి ఉంది. కానీ దానికన్నా ముందే జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే తీర్మానానికి వైయస్ వర్గీయులు ఒడిగట్టవచ్చుననే భయంతో సిఎల్పీ సమావేశం నిర్వహించడం లేదనే మాట వినిపిస్తోంది. అదే సమయంలో వైయస్ మృతికి సంతాపం ప్రకటించడానికి రాష్ట్ర ఉభయ సభల సమావేశం కూడా నిర్వహించాల్సి ఉంది. అందుకు కూడా జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండే ప్రధాన అడ్డంకిగా మారింది.
సిఎల్పీ సమావేశాన్ని రేపో మాపో ఏర్పాటు చేయవచ్చుననే ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పుడిప్పుడే సమావేశ పరిచే ఆలోచనలో పార్టీ అధిష్ఠాన వర్గం లేనట్లు కనిపిస్తోంది. అట్లని రోశయ్యను సుదీర్ష కాలం ముఖ్యమంత్రిగా కొనసాగించే అవకాశం కూడా లేదంటున్నారు. జగన్ వర్గీయులు చల్లబడి, తాము రూపొందించిన ఫార్ములాను జగన్ అంగీకరించే వరకు రోశయ్యను కొనసాగించే అవకాశం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications