కాంగ్రెసుతో తెంచుకోం: పవార్

రెండు నుంచి నాలుగు సీట్ల కోసం కాంగ్రెసు, ఎన్సీపి కూటమి చీలడం తనకు ఇష్టం లేదని శరద్ పవార్ అన్నారు. వచ్చే నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు పోలింగ్ జరుగుతుంది. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18వ తేదీన ప్రారంభమవుతుంది. ఇది 25వ తేదీతో ముగుస్తుంది. ఈలోగా సీట్ల సర్దుబాటు జరగాల్సి ఉంటుంది. 2004లో పోటీ చేసిన స్థానాల కన్నా 13 సీట్లను ఎక్కువ తీసుకుని కాంగ్రెసు 179 సీట్లకు ఈసారి పోటీ చేయాలని భావిస్తోంది. ఎన్సీపికి 109 సీట్లను కేటాయించాలని భావిస్తోంది. 2004 ఎన్నికల్లో ఎన్సీపి 122 స్థానాలకు పోటీ చేసింది.












Click it and Unblock the Notifications