కెవిపి ఆశ నిరాశే...

ప్రణబ్ ముఖర్జీని ఆంధ్రప్రదేశ్ కు చెందిన కె. కేశవరావు కూడా కలుసుకున్నారు. తాను రాష్ట్రం గురించి ప్రణబ్ ను కలవలేదని, పశ్చిమ బెంగాల్ పై మాట్లాడేందుకే కలిశానని కేశవరావు మీడియా ప్రతినిధులకు చెప్పారు. అధిష్ఠానం అందరితో మాట్లాడి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని కేశవరావు అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నారు, ఆలస్యం అయినా ఇబ్బందిలేదని ఆయన అన్నారు. కెవిపి రామచందర్ రావు ఆదివారం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని కలుసుకున్నారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత పార్టీ తగిన నిర్ణయం తీసుకుంటుందని వీరప్ప మొయిలీ అన్నారు రాష్ట్రంలో నాలుగున్నరేళ్లు ప్రభుత్వాన్ని అందించాల్సి ఉందని, తగిన సమయంలో సరైన పరిష్కార మార్గం కనుక్కుంటామని ఆయన అన్నారు. సోనియాతో మాట్లాడిన తర్వతా ఏ విషయమూ చెబుతామని ప్రణబ్ తనతో చెప్పినట్లు కెవిపి రామచందర్ రావు మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications