వైయస్ జగన్ గ్రూప్ డైలమా

అంతా మీడియా తప్పేనన్నట్లుగా ఆయన మాట్లాడారు. మీడియా సొంత డెడ్ లైన్లు పెట్టవద్దని ఆయన అన్నారు. సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేయడం తమ సొంత వ్యవహారమని, అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ఆయన సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలో అన్నారు. అధిష్ఠాన వర్గం ఏ మాత్రం తమకు సుముఖంగా లేదని తెలియడంతో రాష్ట్రంలోని మంత్రులు మల్లగుల్లాలు పడుతున్నారు. కొంత మంది మంత్రులు సోమవారం రాత్రి ముఖ్యమంత్రి కార్యాలయంలో సమావేశమై చర్చలు జరిపారు. మంగళవారం కెవిపి రామచందర్ రావు మాట్లాడిన తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలని వారు ఆలోచిస్తున్నారు. మొత్తం మీద, జగన్ వ్యవహారాన్ని ఇప్పుడిప్పుడే తేల్చే ఉద్దేశంతో పార్టీ అధిష్ఠాన వర్గం లేదని స్పష్టమై పోయింది. అంతేకాకుండా జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ఇష్టం లేకనే జాప్యం చేస్తోందనే మాట వినిపిస్తోంది. నిజానికి, జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోమని కెవిపి రామచందర్ రావుకు పార్టీ అధిష్టానం నాయకులు ఇప్పటికే స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications