ప్రమాదంలో 6గురు యాత్రికుల మృతి

ఒరిస్సాలోని భద్రక్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పూరీ నుంచి తిరిగి వెళ్తున్న యాత్రికుల బస్సు రోడ్డు పక్కన ఆగింది. వేగంగా వచ్చిన ట్రక్కు ఆ బస్సును వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. యాత్రికులు ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ కు చెందినవారు.












Click it and Unblock the Notifications