హైదరాబాద్: హైదరాబాదులోని బాలానగర్ లో ఇంటర్మీడియట్ విద్యార్థిని శిరీష శనివారంనాడు ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాయల్ కళాశాలలో చదువుతోంది. తండ్రి కళాశాల ఫీజు చెల్లించకపోవడంతో మనస్తాపానికి గురై ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు ఆమె ఒక లేఖ రాసి పెట్టి ప్రాణాలు తీసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాలిక శవాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలవరం కలిగించింది.