హైదరాబాద్: సికింద్రాబాదులోని అడ్డగుట్టలో రమేష్ అనే యువకుడిపై యాసిడ్ దాడి జరిగింది. రమేష్ పై నలుగురు వ్యక్తులు యాసిడ్ తో దాడి చేసి పారిపోయారు. దాడికి పాల్పడింది ఎవరనేది తెలియడం లేదు. రమేష్ కు శత్రువులు ఎవరూ లేరని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మిత్రులే ఈ దాడికి పాల్పడి వచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన రమేష్ ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి దారి తీసిన కారణాలపై ఆరా తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.