అసోంలో భారీ భూకంపం

Assam
గౌహతి: అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాలను సోమవారం మధ్యాహ్నం భారీ భూకంపం తాకింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల 26 నిమిషాలకు ఈ భూకంపం వచ్చింది. ప్రాణ నష్టమేదీ సంభవించినట్లు వార్తలు రాలేదు. భారత - భూటాన్ సరిహద్దు కేంద్రంగా ఈ భూకంపం వచ్చినట్లు అమెరికాలోని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రాంతం గౌహతికి 125 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

గౌహతిలోని భారీ నిర్మాణాలు, భవంతులు బీటలు వారినట్లు తెలుస్తోంది. ఆగస్టు 13వ తేదీ నుంచి తీవ్రంగా ఈ ప్రాంతాలను భూకంపం తాకడం వరుసగా ఇదే ఐదో సారి. ఉత్తర బెంగాల్ ప్రాంతాలను, ఆ రాష్ట్ర రాజధాని కోల్ కత్తాను కూడా భూకంపం తాకింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+