జగన్ పై కుట్ర అబద్ధం: కెకె

కాంగ్రెసుకు ఒక పద్ధతి ఉందని కేశవరావును కలిసిన మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనేది తమ డిమాండ్ కాదని, అది తమ కోరిక అని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తమ కోరికను పార్టీ అధిష్ఠాన వర్గం పరిగణనలోకి తీసుకుంటుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెసు సిద్ధాంతం ఉన్న పార్టీ అని ఆయన అన్నారు.
ఇదిలా వుంటే, తాజా రాజకీయ పరిణామాలపై దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావును పలువురు కాంగ్రెసు నాయకులు కలుస్తూనే ఉన్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాధ్యమిక విద్యా మంత్రి మాణిక్యవర ప్రసాద రావు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కెవిపిని కలుసుకున్నారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు నియోజక వర్గాల సమస్యలు, వాటి అభివృద్ధిపై కెవిపితో చర్చించినట్లు మాణిక్యవర ప్రసాద్ చెప్పారు.












Click it and Unblock the Notifications