జగన్ ను సిఎం చేయాల్సిందే: రోజా

ఆర్జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి బీహార్ ముఖ్యమంత్రి అయిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వయస్సులో తమ కన్నా చిన్నవాడైనా వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగించే సత్తా జగన్ కు మాత్రమే ఉందని ఆమె అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే ప్రజాభిప్రాయాన్ని కాంగ్రెసు పార్టీ అధిష్ఠాన వర్గం గౌరవిస్తుందనే పూర్తి విశ్వాసం తనకు ఉందని రోజా అన్నారు.
ఇడుపులపాయలో ఉన్న జగన్ ను కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో పాటు పలువురు పరామర్శించారు. జగన్ ను పరామర్శించేందుకు పెద్ద యెత్తున ప్రజలు తరలి వస్తున్నారు. తనను పరామర్శించడానికి వస్తున్న ప్రజలకు జగన్ ధైర్యవచనాలు చెబుతున్నారు. జగన్ సోమవారం మరోసారి తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. వైయస్ రాజశేఖర రెడ్డి భార్య విజయలక్ష్మి, కూతురు షర్మిలా కూడా వైయస్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.












Click it and Unblock the Notifications