కెసిఆర్ దర్బార్ కు సై: రెబెల్స్

K Chandrasekhar Rao
హైదరాబాద్: మంచిర్యాల శాసనసభ్యుడు అరవింద్ రెడ్డి తిరుగుబాటుపై ప్రజాకోర్టు నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన సవాల్ కు ఆ పార్టీ రెబెల్స్ తీవ్రంగా ప్రతిస్పందించారు. తాను ప్రజాకోర్టుకు సిద్ధమని పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన అరవింద్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావే స్వయంగా ప్రజాకోర్టుకు హాజరు కావాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కమిటీ అధ్యక్షుడు మేచినేని కిషన్ రావు అన్నారు. డబ్బు, పదవుల కోసమే తెలంగాణ ఉద్యమాన్ని నడుపుతున్నారని వస్తున్న వార్తలపై కెసిఆర్ సంజాయిషీ ఇచ్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తనతో సహా తెలంగాణ వాదులు, ఉద్యమకారులు ప్రజాకోర్టుకు హాజరవుతారని ఆయన అన్నారు.

కాగా, తెరాసకు రాజీనామా చేసి కాంగ్రెసులో చేరిన కెకె మహేందర్ రెడ్డి కెసిఆర్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు. తాము నిర్వహించే ప్రజా దర్బార్ కు కెసిఆర్ హాజరు కావాలని ఆయన సవాల్ చేశారు. తామే హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో దర్బార్ ఏర్పాటు చేస్తామని, దీనికి కెసిఆర్ హాజరు కావాలని ఆయన అన్నారు. తాము వేసిన ప్రశ్నలకు కెసిఆర్ సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తాము ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకనే కెసిఆర్ ఢిల్లీ పారిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+