స్త్రీ ప్రాణాలు తీసిన సచ్ కా సామ్నా

పల్లవికి 12 ఏళ్ల కుమారుడున్నాడు. అతను మాజీ భర్తకు పుట్టిన కొడుకు. ఆమె భార్యను వదిలేసిన ధర్మేంద్ర అనే వ్యక్తితో కలిసి జీవిస్తోంది. ఆమె ఆదివారంనాడు సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసు అధికారులు చెప్పారు. సచ్ కా సామ్నాలో రూపా గంగూలీ గత జీవితం గురించి వేసిన ప్రశ్నలకు పల్లవి తీవ్రంగా కలత చెందిందని, అప్పటి నుంచి ఆమె మానసికంగా కృంగిపోయిందని ధర్మేంద్ర పోలీసులకు చెప్పాడు. ఆదివారం సాయంత్రం ఇరుగుపొరుగు వారు తలుపులు తట్టారు. సమాధానం లేకపోవడంతో వారు ధర్మేంద్రను పిలిచారు. అతను తలుపులు తీసే సరికి పల్లవి మరణించింది. తన జీవితంతో విసిగిపోయానని అంటూ ఆమె ఒక లేఖ రాసిపెట్టింది.
తాను అందరికీ భారమయ్యానని, మంచి కూతురును, తల్లిని, సోదరిని, భార్యను కాలేకపోయానని, ప్రపంచంలో తాను తప్ప అందరూ బాగానే ఉన్నారని, అందువల్ల తాను వెళ్లిపోతున్నానని, తన మరణాన్ని తన కుమారుడికి, భర్తకు తెలియజేయాలని, తాను తన కుమారుడు కవిని గుర్తుంచుకుంటానని, వారు తన అంత్యక్రియలకు వస్తారని ఆశిస్తున్నానని ఆమె ఆ లేఖలో రాసింది. ధర్మేంద్ర మంచి వ్యక్తి అని, తనను జాగ్రత్తగా చూసుకుంటాడని, తాను అతని కీప్ గా ఎంతో కాలం ఉండలేనని ఆమె రాసింది.












Click it and Unblock the Notifications