సయీద్ పై చర్య చేపట్టాల్సిందే: కృష్ణ
న్యూయార్క్: జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్ ను ముంబై దాడుల కేసులో పాకిస్తాన్ ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ఎం కృష్ణ డిమాండ్ చేశారు. ముంబై దాడుల సూత్రధారి సయీద్ అనే విషయంలో తమ వైఖరిలో ఏ విధమైన అస్పష్టత లేదని ఆయనఅన్నారు. న్యూయార్క్ లోని ఓ న్యూస్ చానెల్ తో ఆయన మాట్లాడారు. ముంబై దాడుల కుట్రదారులను శిక్షించాల్సిందేనని ఆయన అన్నారు.
సయీద్ పై చర్య విషయంలో పాకిస్తాన్ చర్యలపై రకరకాల కథనాలు వస్తున్నాయని ఆయన అన్నారు. ముంబై దాడుల విషయంలో పాకిస్తాన్ ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనేదే తమకు కావాల్సిందని, ముంబై దాడుల కేసులో సయీద్ పై కేసులు పెట్టాలని తాము కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. ఈ విషయంలో పాకిస్తాన్ వెంటనే చర్యలు చేపట్టాలని కూడా ఆయన అన్నారు. కంటి తుడుపు చర్యలను తాము అనుమతించబోమని ఆయన అన్నారు. సయాద్ పై కేసు పెట్టే విషయంలో పాకిస్తాన్ పై ఒత్తిడి కొనసాగిస్తూనే ఉంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications