తెరాస కీలక నేతల అరెస్టు

మంచిర్యాలకు బయలుదేరిన తెరాస నేత నాయని నర్సింహారెడ్డి, నారదాసు, కెప్టెన్ లక్ష్మీకాంతరావులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే శాసనసభ్యులు కొప్పుల ఈశ్వర్, వినయ్ భాస్కర్ లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాలలో ప్రజాకోర్టు నిర్వహించి తీరుతామని నాయని నర్సింహారెడ్డి అంటున్నారు. పోలీసులు ప్రజాకోర్టు నిర్వహణకు అనుమతి నిరాకరించారు. కోర్టుకు వెళ్లయినా సరే ప్రజాకోర్టు నిర్వహణకు అనుతి తెచ్చుకుంటామని నాయని అంటున్నారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు మంచిర్యాలకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎక్కడికక్కడ వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు.












Click it and Unblock the Notifications